శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు , బోనీకపూర్ నిర్మాతలుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ కథానాయిక. సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ “పింక్ ” తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో అంజలి , నివేద థామస్ , అనసూయ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న “వకీల్ సాబ్ “మూవీ షూటింగ్ 6 నెలల తరువాత పునః ప్రారంభం అయ్యింది. హీరో పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలను దర్శకుడు వేణు తెరకెక్కించారు. హీరో పవన్ కళ్యాణ్ షూటింగ్ సెట్ లో నిన్న అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ పై కోర్టు సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మగువా మగువా సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ తరువాత పవన్ కళ్యాణ్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2 సంవత్సరాల గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న “వకీల్ సాబ్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























