బిగ్ బాస్ 4- అమ్మ రాజశేఖర్ కు ‘డబుల్ ధమాకా’

Bigg Boss Telugu 4 : Amma Rajasekhar Gets Double Dhamaka

బిగ్ బాస్ 4- వీకెండ్ ఎపిసోడ్ కాబట్టి హౌస్ మేట్స్ ఫుల్ జోష్ లో ఉంటారు.. కానీ నోయల్ వెళుతూ.. వెళుతూ చేసిన రచ్చకి వీకెండ్ అయినా కూడా హౌస్ ఫుల్ హీట్ ఎక్కింది. ఇక ఎపిసోడ్ స్టార్టింగే అవినాష్.. అమ్మ రాజశేఖర్ నోయల్ పై ఆగ్రహం చేశారు. వెళుతూ.. వెళుతూ బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదని అసహనం వ్యక్తం చేసారు. ఇక వీరిని కూల్ చేయడానికి… సండే ఫన్‌డే కావడంతో అందరికీ కామెడీ టాస్క్‌లు ఇచ్చి కాస్త ఎంటర్ టైన్ చేశారు. హౌస్‌మేట్స్‌ని రెండు టీమ్‌లుగా విడగొట్టి డాన్స్‌ చేయించారు. అనంతరం నామినేషన్‌లో ఉన్న మోనాల్‌, అరియానా, అమ్మరాజశేఖర్‌, మోహబూబ్‌ని స్టేజ్‌ మీద నిల్చోపెట్టి.. ఒకరిని సేవ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈరోజు ఫస్ట్ మోనాల్ సేవ్ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మరో టాస్క్‌లో హౌస్‌మేట్స్‌ ఒకరినొకరు ఇమిటేట్‌ చేయాలి. మొదటగా మోనాల్‌ అవినాష్‌ని ముద్దు పెట్టాక ఎలా బిహేవ్‌ చేస్తాడో చేసి చూపించాలని అరియానాను కోరాడు. దీంతో అరియానా ఇమిటేట్‌ చేసి చూపించింది. దీంట్లో భాగంగా అఖిల్‌ అవినాష్‌ను ఇమిటేట్‌ చేశాడు. మోనాల్‌ దగ్గరికి వెళ్లి కిస్‌ ఇవ్వమని అడిగాడు. పక్కన ఉన్న అరియానా..అవినాష్‌ అంటూ దగ్గరకు రాగా .. మోనాల్‌ నాకు కిస్‌ ఇస్తా అంటే వద్దు అంటున్న అంటూ కవర్ చేస్తాడు. అలాగే హారిక లాగా అవినాష్‌ ఇమిటేట్‌ చేస్తూ చిన్న పిల్లలా పరిగెడుతూ.. అభిజిత్‌ను హగ్‌ చేసుకున్నాడు. ఇక రాజశేఖర్‌ మాస్టర్‌లాగా సోహైల్‌, అవినాష్‌లు ఇమిటేట్‌ చేస్తూ కోపంలో మాస్టర్‌ ఎలా మాట్లాడుతారో చూపించారు. ఇక అరియానా, లాస్యలను ఇమిటేట్‌ చేసిన అవినాష్‌.. ఓ రేంజ్‌లో నవ్వులు పూయించారు. ఇక లాస్య వంటపై కంప్లైట్‌ వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో చూపించాలని నాగార్జున కోరగా.. అవినాష్‌ ఓ రేంజ్‌లో ఇమిటేట్‌ చేశాడు. దీంతో అందరితో పాటు లాస్య కూడా నవ్వింది. ఇక ఏదైనా గాసిప్స్‌ వస్తే లాస్య ఎలా బిహేవ్‌ చేస్తుందో హారిక చేసి చూపించింది. ఆ తర్వాత ఓ ఫజిల్‌ టాస్క్‌ ఇచ్చి సోహైల్‌ ద్వారా అరియానాను సేవ్‌ చేయించాడు.

ఇక ఆ తర్వాత గత సీజన్లలో చూసినట్టే ఇక ఈ వారం కూడా కాలర్‌ ఆఫ్‌ ది వీక్‌ను పరిచయం చేశాడు నాగార్జున. ఫస్ట్ అభిజిత్‌కు కాల్‌ వచ్చింది. ఓ మహిళా అభిమాని అభిజిత్‌కు ఫోన్‌ చేసి ప్రతివారం నామినేట్‌ అవుతుంటే ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించారు. దీనికి అభిజిత్‌ సమాధానం ఇస్తే.. ప్రేక్షకుల దయతో ఇప్పటి వరకూ సేవ్‌ అవుతూ వస్తున్నానని, ఓట్లు వేసిన అందరికి రుణపడి ఉంటానని చెప్పాడు.

ఫైనల్ గా మిగిలి ఉన్న అమ్మ రాజశేఖర్‌, మెహబూబ్‌లను కన్ఫెషన్‌ రూమ్‌లోకి రమ్మని నాగార్జున సూచించడంతో ఇద్దరు అక్కడి వెళ్లారు. ఇద్దరి ఫోటోలు పెట్టి ఎవరు అవసరం.. ఎవరు అవసరం లేదో చెప్పాలని హౌస్‌మేట్స్‌ ఒపీనియన్‌ అడిగాడు. దీంతో అఖిల్‌, అభిజిత్‌, సోహైల్‌, మోనాల్‌, లాస్య, హారిక మెహబూబ్‌ ఉండాలని కోరగా, అవినాష్‌, అరియానాలు మాత్రం మాస్టర్‌కు సపోర్ట్‌ చేశాడు. దీంతో అమ్మ రాజశేఖర్‌ వెళ్లిపోవాలని ఆరుగురు, మెహబూబ్‌ వెళ్లిపోవాలని ఇద్దరు కోరారని, అందుకే మాస్టర్‌ ఎలిమినేట్‌ అని చెప్పేశాడు. ఇక మాస్టర్‌ కూడా కంటతడి పెడుతూ కన్ఫెషన్‌ రూమ్‌ నుంచి ఇంట్లోకి వచ్చాడు. ఇక ఇక్కడ నాగార్జున చిన్న ట్విస్ట్‌ ఇచ్చాడు. మాస్టర్‌ కూడా సేవ్‌ అయినట్లు ప్రకటించాడు. అనారోగ్యం కారణంగా నోయల్‌ ఈ వారం బయటకు వచ్చాడని, అతని విజ్ఞప్తి మేరకే మాస్టర్‌ని సేవ్‌ చేస్తున్నట్లు నాగ్‌ ప్రకటించాడు. దీంతో హౌస్‌మేట్స్‌ అంతా సంతోషంతో చిందులేయగా, మాస్టర్‌ మాత్రం నేను వెళ్తా అంటూ ఏదో చెప్పబోయాడు. వెంటనే నాగార్జున కలుగజేసుకొని మీకు ఎక్కువ ఓట్లు వచ్చిన కారణంగా వచ్చేవారం కెప్టెన్సీ పోటీకి నేరుగా ఎంపికయ్యారంటూ మరో ట్విస్ట్‌ ఇచ్చాడు. దీంతో మాస్టర్‌ సంతోషించాడు.

మరి ఈరోజు నామినేషన్ ప్రక్రియ ఉండబోతుంది. ఒక్కొక్కరు తలపై గుడ్లు పగలగొట్టి నామినేషన్ చేయాల్సి ఉంటుంది. చూద్దాం మరి ఈ రోజు హౌస్ ఇంకెంత హీటెక్కుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.