నరేంద్ర దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ‘మిస్ ఇండియా’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా స్టార్ట్ చేశారు. ఇప్పటీకే టీజర్.. ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా నుండి ‘లచ్చ గుమ్మాడి గుమ్మాడిరా…’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఫోక్ సాంగ్ స్టైల్లో కల్యాణ చక్రవర్తి రాసిన ఈ పాటను శ్రీవర్ధిని ఆలపించారు. ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది
మహానటి’ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఇక ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుంది. ఒక పక్క తెలుగులో సినిమాలు చేసుకుంటూనే మరోపక్క అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది.
కాగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా ఈ మూవీ లో జగపతి బాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్, నదియా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























