ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో ఉన్నసంగతి తెలిసిందే. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం హిమాలయాలకు వెళ్ళింది చిత్రయూనిట్. ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో మొదలైంది. దాదాపు మూడు వారలు అక్కడే నిర్విరామంగా షూటింగ్ చేసుకోనున్నారు. సుదీర్ఘంగా కొనసాగే ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ బయటకి వచ్చింది. అదేంటంటే.. అక్కడ నాగ్ కు ఒక బాలీవుడ్ స్టార్ హీరో తండ్రి స్టంట్స్ కంపోజ్ చేయనున్నారట. ఆ స్టార్ హీరో ఎవరో కాదు… విక్కీ కౌషల్. విక్కీ కౌషల్ తండ్రి శ్యామ్ కౌషల్. ఈ సినిమా కోసం శ్యామ్ కౌషల్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది. యాక్షన్ సన్నివేశాలు రియలిస్టిక్ గా ఉండాలని.. దానికి శ్యామ్ కౌషల్ అయితేనే కరెక్ట్ గా ఉంటుందని అతన్ని ఎంపిక చేసుకున్నారట. కాగా `యురీ` చిత్రంతో విక్కీ కౌషల్ దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు.
కాగా యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున నటిస్తున్నాడు. నాగార్జున జోడీగా దియా మీర్జా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో సయామీ ఖేర్ కనిపించనున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























