బిగ్ బాస్ 4- అభి, మోనాల్ కు రాయబారిగా అఖిల్

Bigg Boss Telugu 4: Akhil Talks With Abhijeeth about Monal

బిగ్ బాస్ 4 – అర్ద సెంచరీ పూర్తి చేసుకున్నారు హౌస్ మేట్స్. ఇక నిన్న 51వ రోజు ఎపిసోడ్ స్టార్టింగ్ నామినేషన్స్ తర్వాత హౌస్ మేట్స్ ఇంకా దాని గురించే చర్చించుకుంటున్నారు. అభిజిత్‌తో మోనాల్ మధ్య ఉన్న గ్యాప్ ను క్లియర్ చేసుకోమని అఖిల్ మోనాల్ కు చెపుతాడు. దానికి నేను ఇంకా అలిసిపోయా అని చెప్పడంతో పోనీ నేను మాట్లాడ‌నా అని అనుమ‌తి తీసుకుని అభిజిత్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. ఒక‌సారి కూర్చుని మాట్లాడుకుంటే క్లారిటీ వ‌స్తుంద‌ని అఖిల్ సూచించ‌డంతో అందుకు ఓకే చెప్పిన అభి రేపు మాట్లాడ‌దామన్నాడు. మరోపక్క అమ్మ రాజశేఖర్, సోహెల్, మెహబూబ్ అదే నామినేషన్స్ గురించి చర్చ. తనను సోహెల్ నామినేట్ చేయడంతో అమ్మ రాజశేఖర్ బాధపడతాడు. అక్కడే ఉన్న అఖిల్, మెహబూబ్ ఓదార్చే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత కిచెన్ దగ్గరికి వచ్చి.. త‌ర్వాతి వారం నామినేష‌న్ కోసం ఇప్ప‌టినుంచే త‌న‌తో గొడ‌వ‌లు పెట్టుకోండని సోహైల్ ఇంటిస‌భ్యుల‌కు సూచించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో అఖిల్‌, మోనాల్ ఒక‌చోట అరియానా, అవినాష్ మ‌రోచోట కూర్చుని ముచ్చ‌ట్లు పెట్టుకుంటున్నారు. ఇంతలో మోనాల్ ను చూసి అవినా ఐ హేట్ యూ చెప్ప‌గా, మోనాల్ ప‌రుగెత్తుకుంటూ వెళ్లి నుదుటిపై ముద్దు పెట్టింది. దీనితో షాకైన షాకైన అవినాష్‌.. నా పొలంలో మొల‌క‌లొచ్చాయ్ అంటూ సంతోషంతో ఎగిరి గంతేశాడు. మై హీరోయిన్ మోనాల్ అని గొంతు చించుకుని కేక‌లు పెట్టాడు. అస‌లైన A అవినాష్ అని అర్థ‌మైందంటూ కాసేపు కామెడీ చేసాడు.

ఇక అమ్మ రాజశేఖర్ ను నామినేట్ చేసినందుకు అమ్మ రాజశేఖర్ ఫీల్ అవుతున్నాడని.. ఎలానో ఉందని సోహైల్ తన బాధను అఖిల్ తో పంచుకుంటాడు. అయిన నిద్రపట్టక సోహైల్ దగ్గరకు వెళ్లి ఇదే విషయం పై డిస్కస్ చేస్తాడు. ఇక అక్కడే మోనాల్ ఉంటది. తర్వాత తను లోపలికి వెళ్తుంది . ఈ లోపు అఖిల్ వచ్చి సోహైల్ ఎక్కడ అని అడిగితే నోయల్ దగ్గర ఉన్నాడు.. మీ గురించి మాట్లాడుతున్నాడు అనేసరికి సోహైల్ పై అఖిల్ అసహనం వ్యక్తం చేస్తాడు. దీంతో తానేమీ మాట్లాడ‌లేద‌ని సోహైల్ అఖిల్‌కు క్లారిటీ ఇచ్చాడు. ఇక‌ ఇక్క‌డి విష‌యాలు అక్క‌డ చెప్పొద్ద‌ని చెప్పినా ఎందుకు ఇలానే చేస్తున్నావ్ అని సోహైల్‌ మోనాల్‌కు మళ్లీ చెపుతాడు. ఎవరైనా అడిగినా నాకు అర్ధం కాలేదు అని చెప్పమని సలహా కూడా ఇచ్చాడు.

ఫైనల్లీ ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.‌ ‘బీబీ డేకేర్’ అనే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా అరియానా, అవినాష్‌, హారిక‌, మెహ‌బూబ్ చంటిపిల్ల‌లుగా మారిపోయారు. అవినాష్‌కు నోయ‌ల్‌, అరియానాకు సోహైల్, మెహ‌బూబ్‌కు అఖిల్‌, హారిక‌కు మోనాల్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌కు అభిజిత్ కేర్ టేక‌ర్లుగా వ్య‌వ‌హ‌రించారు.‌ లాస్య సంచాల‌కురాలిగా వ్య‌వ‌హరించింది. కేర్ టేక‌ర్లు పిల్ల‌ల‌కు అన్నం తినిపిస్తూ, బ‌ట్ట‌లు మారుస్తూ, డైప‌ర్లు వేయాల్సి ఉంటుంది. చ‌దువు చెప్ప‌డంతో పాటు ఎంట‌ర్‌టైన్ చేయాలి. వారికి కావాల్సినవ‌న్నీ స‌మ‌కూరుస్తూ ఏడుపు సౌండ్ వినిపించ‌గానే డైప‌ర్లు మార్చాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌లో ఒక‌రు విజేత‌గా నిల‌వ‌గా వారికి ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని బిగ్‌బాస్ చెప్పాడు.

ఇక టాస్క్ మొదలవ్వగానే పిల్లలు చిచ్చర పిడుగుల్లా చెలరేగిపోయారు. ఒకరకంగా కేర్ టేకర్లకు మెహబూబ్, అరియనా, హారిక, అవినాష్ చుక్కలు చూపించారు. మాస్ట‌ర్ హారిక చాక్లెట్లు కొట్టేశాడు. త‌ర్వాత ఆమె కోపంతో అరియానా పెన్సిల్ కొట్టేయ‌డంతో ఇద్ద‌రూ త‌ల‌బ‌డ్డారు. చివ‌ర‌కు అరియానా త‌న పెన్సిల్‌ను తాను ద‌క్కించుకుంది. మరి రేపు టాస్క్ అయ్యేలోపు ఎన్ని తిప్పలు పెడతారో చూడాలి మరి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + three =