కెప్టెన్ గోపినాధ్ జీవిత చరిత్ర ఆధారంగా.. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ‘సూరరై పోట్రు’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ లో రిలీజ్ అవుతుంది. అయితే అక్టోబర్ 30న విడుదల చేయాలని ఫిక్స్ చేసారు కానీ కొన్ని కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇక దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 12న రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక దసరా సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా అఫిషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. అతితక్కువ ధరలతో ప్రతీ వ్యక్తి విమాన ప్రయాణం చేసే విధంగా.. విమాన సంస్థను ప్రారంభించానుకున్న సామాన్య యువకుడు ఎలా కష్టాల పాలయ్యాడు అనే అంశంతో తెరకెక్కించినట్టు అర్ధమవుతుంది ట్రైలర్ ను చూస్తే. ఇందులో హీరో సూర్య, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చెప్పే డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. వ్యవసాయం చేసేవాడు విమానం ఎక్కుతాడు.. టికెట్టు ధర ఒక్క రూపాయే.. అంటూ చెప్పిన డైలాగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: