బిగ్ బాస్ 4 – చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 4 లో 50 రోజులు పూర్తయ్యాయి. 7వారాలు పూర్తయ్యేసరికి హౌస్ లో 11మంది సభ్యులు మాత్రమే మిగిలిఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఎప్పటిలానే వారివారి పనులతో బిజీ అయ్యారు. మార్నింగ్ మస్తీలో భాగంగా ఒకరిగురించి ఒకరి ఒపీనియన్ ను పేపర్ లో రాసి అభిప్రాయాలు పంచుకున్నారు. దివి వేసిన బిగ్ బాంబ్ ప్రకారం లాస్య కిచెన్‌లో వంట చేస్తూ బిజీ ఉండగా అఖిల్ హెల్ప్ చేస్తున్నాడు. ఆ తర్వాత అభిజిత్‌కు బిగ్ బాస్ టీం వస్తువులతో బట్టలని తిరిగి ఇచ్చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎప్పటిలాగానే అభిజిత్, లాస్య, నోయల్, హారికలు గ్రూప్ డిస్కషన్ పెట్టారు. లాస్య, నోయల్ మోనాల్ గురించి చెపుతూ అభిజిత్ పై కామెడీ చేశారు. అందరి బెడ్ షీట్లు మడత పెట్టి.. నీ బెడ్ షీట్ మడతపెట్టలేదంటే చూడు నువ్వంటే ఎంత స్పెషలో.. లాస్య, నోయల్ అనగా దానికి అభిజిత్ .. ఆమె మడత పెట్టినా కూడా నేను తీసేస్తా. ఆమె విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నాను అంటూ మోనాల్‌పై కొంత అసహనం వ్యక్తం చేశాడు.

ఇక డైరెక్ట్ గా నామినేషన్ ప్రక్రియలోకి వచ్చేసాడు బిగ్ బాస్. ఎవరి వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ పేర్లు, కారణం చెప్పి ఇద్దరిని నామినేట్ చేయాలని కోరారు. నామినేట్ చేసిన వారి ఫోటోల ప్లేట్స్ ని సుత్తితో పగలగొట్టాలని సూచించాడు. ఇక లాస్యతో నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. నన్ను కన్నింగ్ స్మైల్ అని మాస్టర్ అన్న కారణంగా ఆయనని నామినేట్ చేస్తున్నాను అలానే మోనాల్ కు మూడ్ స్వింగ్స్ అని.. సడెన్‌గా నాతో మాట్లాడడం ఆపేసింది.. మళ్లీ సడెన్ గా తానే వచ్చి మాట్లాడిందని.. అందుకే ఆమెని నామినేట్ చేస్తున్నాను అని పేర్కొంది. అనంతరం అఖిల్.. అరియానా ఇతరులు చెప్పేది వినదని, అరుస్తూనే ఉంటుందని ఆ కారణంగా తనని నామినేట్ చేస్తున్నా అని పేర్కొన్నాడు. ఇక మాస్టర్‌ని నామినేట్ చేసిన అఖిల్ సింపతి అనే పదం వాడటం నాకు నచ్చలేదు. ఆ కారణంగా నామినేట్ చేశానని పేర్కొన్నాడు. ఇక మెహబూబ్.. అరియానా, మోనాల్‌లని నామినేట్ చేయగా, అవినాష్.. లాస్య, హారికలని, అమ్మా రాజశేఖర్.. అఖిల్, లాస్యలని, అరియానా.. మెహబూబ్, అఖిల్‌లని, సొహైల్.. అరియానా, రాజశేఖర్‌లని నోయల్.. మెహబూబ్, అఖిల్‌లని, అభిజిత్.. మోనాల్ గజ్జర్, అమ్మా రాజశేఖర్‌లని, హారిక.. అరియానా, మెహబూబ్‌లని, మోనాల్ గజ్జర్.. మెహబూబ్. లాస్య లను నామినేట్ చేశారు.

మొత్తానికి ఈ వారం నామినేషన్స్ కూడా చాలా హాట్ హాట్‌గా జరగగా 8వ నామినేషన్‌లో భాగంగా అమ్మ రాజశేఖర్, అరియానా, మెహబూబ్, లాస్య, అఖిల్, మోనాల్ ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఉంటారు.. ఎవరు హౌస్ ను వీడి వెళ్తారు అని తెలియాలంటే వీకెండ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























