బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కియారా అద్వానీ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మోడరన్ డ్రెస్ లతో పాటు ట్రెడిషినల్ డ్రెస్ లలో ఫొటో షూట్స్ లో పాల్గొని ఆ ఫొటోలను కియారా సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కియారా కథానాయికగా నటించిన “లక్ష్మీ బాంబ్ “, “ఇందూ కి జవానీ “షేర్ షా “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “బుల్ భులయ్యా 2” మూవీ చిత్రీకరణ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




తొలిప్రేమ జ్ఞాపకాలు ప్రతీ ఒక్కరి హృదయంలో పదిలంగానే ఉంటాయి. చదువుకునే రోజుల్లో తన ప్రేమాయణం గురించి కియారా చెబుతూ .. తొలి ప్రేమ విఫలం అయినా ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ తాజాగానే ఉంటాయనీ , ప్లస్ టూ చదువుతున్న రోజుల్లో ఒక అబ్బాయి ని ఎంతగానో ఇష్ట పడ్డాననీ , సెలవు రోజుల్లో ఇంట్లో అబద్ధం చెప్పి అతడిని కలుసుకొనేదాన్ననీ , చదువు ను అశ్రద్ద చేస్తున్నానని పేరెంట్స్ కోప్పడేవారనీ , ఈ సంఘర్షణ మధ్య తన ప్రేమను త్యాగం చేశాననీ , ఆ సమయం లో అంతులేని మానసిక వేదన అనుభవించాననీ , వయసు పరిపక్వత తో కోలుకున్నాననీ కియారా చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























