వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘రంగ్ దే’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వగా.. కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూట్ ను మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రోజు కీర్తి సురేష్ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలోనే యంగ్ హీరో నితిన్ కూడా కీర్తికి విషెస్ తెలియజేశాడు. `నా స్వీటెస్ట్ కోస్టార్ కీర్తీ సురేష్‌కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరమంతా నీకు బాగుండాలి కీర్తి` అంటూ లోకేషన్‌లో తీసిన ఫొటోను నితిన్ షేర్ చేస్తూ నితిన్ ట్వీట్ చేశాడు.
Wishing one of my sweetest costars i hv ever worked with @KeerthyOfficial a very happyy birthdayy!! Hv a great one kits 🤗🤗 #HBDKeerthySuresh pic.twitter.com/zC3nW4wMXw
— nithiin (@actor_nithiin) October 17, 2020
కాగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.
ఇదిలా ఉండగా భీష్మ సూపర్ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు నితిన్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘అంధాదున్’ సినిమా రీమేక్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇంకా చైతన్య కృష్ణ దర్శకత్వంలో ‘పవర్ పేట’ సినిమా కూడా లైన్ లో వుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































