అన్నను పిల్లోగా మార్చేసుకున్న అల్లు అర్హ

Allu Sneha Reddy Shares A Cute Picture Of Her Kids On Instagram

హీరోల సంగతి పక్కన పెడితే వాళ్ల సతీమణులు కూడా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. మహేష్ సతీమణి నమ్రత, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి, ఉపాసన, సమంత ఇలా చాలా మంది సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంటారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా స్నేహ తమ పిల్లలకు సంబంధించిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అర్హ పిల్లో మీద కాకుండా తన సోదరుడి వీపు మీద తలపెట్టి నిద్రపోతున్న ఫొటోను పంచుకున్నారు. దీనికి `డోంట్ నీడ్ పిల్లో` అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు. ఇక ఈ ఫొటో చూడటానికి క్యూట్ గా ఉండి ఆకట్టుకుంటుంది. దీనితో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

View this post on Instagram

 

#dontneedapillow

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల తనయ అల్లు అర్హ ఇంత చిన్న వయసులోనే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. అల్లు అయాన్, అల్లు అర్హలు చేసే అల్లరి, వాటికి సంబంధించిన క్యూట్ వీడియోలను ఎప్పటికప్పుడు అల్లు అర్జున్, స్నేహ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. అల్లు అర్హ ముద్దు ముద్దు మాటలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో ‘పుష్ప‌’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్‌ గా నివేదా పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.