టి – సిరీస్ బ్యానర్ పై ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా 3D ఫార్మాట్ లో “ఆదిపురుష్ ” హిందీ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో రాముడిగా ప్రభాస్ , రావణుడు గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. 2021 సంవత్సరం జనవరి లో ప్రారంభం కానున్న “ఆదిపురుష్ ” మూవీ లో శివుడి పాత్రకై స్టార్ హీరో అజయ్ దేవగన్ ఎంపిక అయ్యారని సమాచారం. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందనున్న “ఆదిపురుష్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాయకుడు , ప్రతి నాయకుడు , నిర్మాత , దర్శకుడు అజయ్ దేవగన్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో 3 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ బెస్ట్ యాక్టర్ గా 2 నేషనల్ , 3 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ “రౌద్రం రణం రుధిరం” మూవీ లో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు ఓం రౌత్ , హీరో అజయ్ దేవగన్ కాంబినేషన్ లో రూపొందిన “తన్హాజీ” మూవీ ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































