ప్రస్తుతం ప్రజలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా పడుతున్న విషయం తెలిసిందే. టెక్నాలజీ పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతూనే వున్నాయి. ప్రజలు ఆన్ లైన్ మోసాల బారిన పడుతున్నారు. అమ్మాయిలతో చాటింగ్ చేసి వారి వ్యక్తిగత సమాచారం , ఫొటోస్ సేకరించి సైబర్ నేరస్థులు అమ్మాయిలను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఎంతోమంది యువతులు మోసపోయి మానసిక వేదన ను అనుభవిస్తున్నారు. సోషల్ మీడియా ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త లపై మహిళలకు ఎన్టీఆర్ సందేశం ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
— Hyderabad City Police (@hydcitypolice) October 8, 2020
హైదరాబాద్ నగరపోలీసులు వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం ద్వారా అమ్మాయిలు మోసపోతున్న విధానంతో ఒక వీడియో రూపొందించారు. ఆ వీడియో లో హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ .. వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేయొద్దనీ , అపరిచిత వ్యక్తులతో పరిచయం కష్టాలకు దారితీస్తుందనీ , ఒక వేళ అటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండనీ , జాగ్రత్త అంటూ ఎన్టీఆర్ మహిళలకు సందేశం ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























