కెరీర్ మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమా చేసి మంచి టాక్ ను తెచ్చుకోగా.. ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. నూతన దర్శకుడు హాసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ ” రాజ రాజ చోర”. ఈ సినిమా ఇప్పటికే కొంత వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రాగా ఇప్పుడు మళ్లీ షూట్ ను ప్రారంభించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ముందు స్వర్గీయ ఎస్.పి. బాలు గారికి నివాళులు అర్పించిన అనంతరం ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు పునః ప్రారంభించినట్లు తెలిపారు నిర్మాతలు. శ్రీవిష్ణు, హసిత్ గోలి వంటి ప్రతిభ కలిగినవారితో ఈ చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. హైదరాబాద్ లో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఈ రోజు నుంచి పూర్తయ్యేవరకు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది అని తెలిపారు.

కాగా మేఘా ఆకాష్,సునయన హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి తదితరులు నటిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























