బిగ్ బాస్ 4.. బోరింగ్ గా బీబీ హోటల్ టాస్క్

BB Hotel Task Turns Out To Be Boring For Audience Watching Bigg Boss Season 4 Show

అలా చూస్తుండగానే ఇలా అప్పుడే బిగ్ బాస్ 4 స్టార్ట్ అయి నెల రోజులు అయిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే తమ మాస్కులు తీసేసి నిజ‌స్వ‌రూపాలు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌పడుతున్నాయి. ఇక నిన్న ఎపిసోడ్ విషయానికి వస్తే.. దివి నామినేషన్ లో చెప్పిన రీజన్ కు లాస్య ఇంకా ఏడుస్తూనే ఉండగా పక్కన ఉన్న గంగవ్వ ఓదారుస్తుంటుంది. మరోవైపు మోనాల్ కు అభిజిత్, అఖిల్ ఇద్దరూ సారీ చెప్పారు. అనంత‌రం నోయ‌ల్ త‌ను నామినేట్ చేసిన‌ అమ్మ రాజ‌శేఖ‌ర్‌తో మాట్లాడే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ అత‌ను వినిపించుకోలేదు. ఇక నామినేషన్ ప్రక్రియలో హీట్ ఎక్కిన బిగ్ బాస్ హౌస్ రాత్రి ఎపిసోడ్ తో కొంచం కూల్ అయింది. నామినేషన్ ప్రక్రియ అవ్వడంతో ఈ రోజు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనంత‌రం బిగ్‌బాస్‌ అవినాష్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. బీబీ హోట‌ల్‌లో స్టాఫ్ ఛాలెంజ్‌ల‌ను, అతిథుల‌కు అందించే స‌ర్వీసుల‌ను పాడు చేయాలని ఆదేశించాడు. హోట‌ల్ స్టాఫ్‌కు త‌క్కువ స్టార్లు వ‌చ్చేలా చూడాల‌ని చెప్పాడు. ఈ టాస్క్ లో హోట‌ల్ మేనేజ‌ర్ గా అభి‌, సెక్యూరిటీ గా అఖిల్.. ‌ చెఫ్‌ గా సుజాత‌, లాస్య‌, అసిస్టెంట్ చెఫ్ అండ్ వెయిట‌ర్ గా‌‌‌ అమ్మ రాజ‌శేఖ‌ర్‌.. హౌస్ కీపింగ్ గా నోయ‌ల్‌, కుమార్, స‌ర్వీస్ అండ్ స్పా నిర్వాహకులుగా దివి, మోనాల్‌.. అసిస్టెంట్ మేనేజర్‌గా అవినాష్ వ్య‌వ‌హ‌రించారు. రిచ్‌మెన్లుగా మెహ‌బూబ్‌, సోహైల్‌, హారిక‌ ఉండగా.. రాకుమారిగా అరియానా, రాణి పాత్రలో అరియనా త‌ల్లిగా గంగ‌వ్వ నటించారు.

ఇక గేమ్ మొదలవ్వాగానే హోటల్ స్టాఫ్ తో రిచ్ పీపుల్ హోటల్ స్టాఫ్ తో ఆడుకునే ప్రయత్నం చేశారు. హారిక సర్వీస్ తీసుకోలేదని హారిక అలగడం.. మూడు నిమిషాల్లో కాఫీ కావాలని చెప్పడం లాంటి పనులు చెప్పింది. మెహ‌బూబ్ త‌న‌కు చికెన్ ప‌కోడి కావాలంటే ‌గంట, గంట‌న్నర‌ ప‌డుతుంద‌ని అభిజిత్ చెప్పాడు. నేను అర‌గంట‌లో చేస్తాన‌ని మెహ‌బూబ్ అన‌డంతో వెళ్లి, చేసుకోండి అని అభిజిత్ పంచ్ వేశాడు. త‌ర్వాత రాకుమారి అరియానా అవినాష్ త‌న చేయి పట్టుకున్నాడ‌ని మ‌హారాణి గంగ‌వ్వ‌తో చెప్ప‌డంతో కాలు మొక్కు అని అత‌డికి ఆర్డ‌ర్ వేసింది. ముద్దు పెట్టుకుందామ‌ని కూడా ప్ర‌య‌త్నించారంటూ అరియానా చెప్పడంతో.. అవినాష్ చేసిన ప‌నికి చెంచాతో బకెట్ నింప‌మ‌ని శిక్ష విధించింది.

మరోవైపు అవినాష్ తనకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ను చేసుకుంటూ స్టాఫ్ కు ఇబ్బంది కలిగిస్తూ స్టార్స్ రాకుండా ప్రయత్నం చేస్తున్నాడు. దీనిలో భాగంగానే రాకుమారి అరియనాని చిల్ల‌ర‌గా ప్ర‌వ‌ర్తించ‌కండ‌నిఅనడంతో మ‌ధ్య‌లో సోహైల్ క‌ల‌గ‌జేసుకుని మాట్లాడ‌బోతే దీనితో మీకు సంబంధం లేదంటూ వేలు చూపించాడు. దీంతో మేనేజ‌ర్ అఖిల్ రంగంలోకి దిగి అవినాష్‌ను కొట్టిన‌ట్లు చేసి ప‌క్క‌కు తీసుకెళ్లాడు. ఇక సర్వీస్ చేయించుకొని స్టార్స్ ఇవ్వకపోవడంతో అమ్మ రాజశేఖర్ చిరాకు పడగా.. అక్కడ సోహైల్ కు అమ్మ రాజశేఖర్ కు మధ్య చిన్న గొడవ జరిగింది. మరి అవినాష్ తన సీక్రెట్ టాస్క్ ను కంప్లీట్ చేశాడా..? అభిజిత్ స్టార్స్ కొట్టేశాడని తెలిస్తే రిచ్ పీపుల్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.