15 వసంతాల “ఛత్రపతి “

Rebel Star Prabhas Blockbuster Movie Chatrapathi Completes 15 Years.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ , శ్రియ జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఛత్రపతి ” మూవీ 2005 సంవత్సరం సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. డ్యాన్స్ , యాక్షన్ , ఎమోషనల్ సీన్స్ లో ప్రభాస్  తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రశంసలు అందుకున్నారు. కీరవాణి స్వరపరిచిన సాంగ్స్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “ఛత్రపతి ” మూవీ నేటితో 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 54 సెంటర్స్ లో శత దినోత్సవం జరుపుకుంది. మదర్ పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా భానుప్రియ , బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి నంది అవార్డ్స్ అందుకున్నారు. దర్శకుడు రాజమౌళి, అన్ని క్యారెక్టర్స్ కూ ప్రాధాన్యతనిచ్చి పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా “ఛత్రపతి ” మూవీని రూపొందించారు. “ఛత్రపతి ” మూవీ తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ విజయం సాధించాయి. కన్నడ , బెంగాలీ భాషలలో రీమేక్ జరుపుకొని విజయం సాధించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.