శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ హీరోలతో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ను నిర్మించిన మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలీవుడ్ కు కూడా ఎంటర్ కానున్నారు. ప్రస్తుతం దిల్ రాజు , బోనీ కపూర్ తో కలసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా “వకీల్ సాబ్” రూపొందుతుంది. నిర్మాత దిల్ రాజు ఇప్పుడు నూతన దర్శకుడు , నటీనటులతో ఒక మూవీ ని అనౌన్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీమతి అనిత సమర్పణ లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పద్మశ్రీ దర్శకత్వంలో సాగర్ ఆర్ కె నాయుడు , దృశ్య రఘునాథ్ జంటగా “షాదీ ముబారక్ ” మూవీ రూపొందనుంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. దిల్ రాజు బ్యానర్ , టైటిల్ విభిన్నంగా ఉండడంతో “షాదీ ముబారక్ ” మూవీ పై ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం అభినందించాల్సిన విషయమే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























