మొత్తానికి సోనుసూద్ కు తాను చేసిన మంచి పనులకు తగిన గుర్తింపు లభిస్తుంది. కరోనా సమయంలో ఎంతో మందికి అండగా నిలిచిన సోనూసూద్ పై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు అందరు. కొంతమంది అయితే ఏకంగా దేవుడితోనే పోల్చారు. ఇక ఇప్పుడు సోనూసూద్ కు జాతీయంగా కాదు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్‌డిపి) స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించింది. తను చేస్తున్న సహాయ కార్యక్రమాలను గుర్తించిన ఈ అంతర్జాతీయసంస్థ సోనూసూద్‌ను ఈ అరుదైన పురస్కారాన్ని అందించారు. దీనితో ఆయన అభిమానులే కాక ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవలే అల్లుడు అదుర్స్ సినిమా సెట్స్ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా సోనూసూద్ ను సత్కరించిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీల్ లైఫ్ లో విలన్ పాత్రల్లో నటించినా రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ఎంతోమందికి బాసటగా నిలిచాడు. ఎంతోమంది వలస కార్మికులను ప్రత్యేక బస్సులు, రైళ్లు, ఫ్లైట్లలో వారి స్వస్థలాలకు చేర్చారు. ఇప్పుడు మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ప్రాణాలు కోల్పోయిన వలస కార్మికుల కుటుంబాలకు అండగా నిలవనున్నాడు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తానని.. ఇలా ఒకటి కాదు చాలా మందికి సాయం చేసాడు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























