అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నిశ్శబ్దం సినిమా ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే టీజర్స్,ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన మాధవన్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఓ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన మాధవన్ మాట్లాడుతూ ఈ సినిమా ఏదో మల్టీ లాంగ్వేజ్ సినిమా అని ఒప్పుకోలేదు.. కథ తో పాటు ప్రతిఒక్క క్యారెక్టర్ కు అంతే ప్రాధాన్యత ఉంటుంది అని తెలిపాడు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన అనుష్క కూడా ఏదో మల్టీ లాంగ్వేజ్ సినిమా అని చేయలేదు.. ఈ సినిమాకోసం చాలా ఎఫర్ట్ పెట్టింది.. ఈ సినిమా కోసం అమె ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు అని అనుష్కపై ప్రశంసలు కురిపించారు.
.
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ‘నిశ్శబ్దం’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, మలయాళ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































