శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ “పింక్ ” తెలుగు లో రీమేక్ అవుతుంది. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కథానాయిక. అంజలి , నివేద థామస్ , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కారణంగా నిలిచిపోయిన “వకీల్ సాబ్ ” మూవీ షూటింగ్ 6 నెలల తరువాత పునః ప్రారంభం అయ్యింది. అక్టోబర్ నెలలో శృతి హాసన్ “వకీల్ సాబ్ ” మూవీ షూటింగ్ లో పాల్గొంటారు. ఈ షూటింగ్ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ పై కొన్ని సీన్స్ తెరకెక్కుతాయి. హీరో పవన్ కళ్యాణ్ కు జోడీ గా శృతి హాసన్ “గబ్బర్ సింగ్ “, “కాటమరాయుడు ” మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే. శృతి హాసన్ ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “లాభం ” తమిళ మూవీ లో శృతి , విజయ్ సేతుపతి కి జోడీగా నటిస్తున్నారు. “వకీల్ సాబ్ ” మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ పలు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























