కన్నడ రాకింగ్ స్టార్ యష్ గత కొన్ని నెలల క్రితమే తన కుమారుడిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆరు నెలలు వచ్చినప్పుడు సోషల్ మీడియా ద్వారా ఫొటోస్ షేర్ చేసాడు. ఇక తన కొడుకుని పరిచయం చేసి అప్పుడే ఆరు నెలలు అయిపోతుంది. అప్పటినుండి కుమారుడికి సంబంధించిన ఫోటోలు తరచూ షేర్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా నామకరణ వేడుక జరిపించారు యష్ దంపతులు. తమ ఫాం హౌజ్లో కొద్ది మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమాన్ని జరిపారు. యథర్వ్ యష్ అనే పేరుని తన కుమారుడికి పెట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను యష్ తన ఇన్స్టా లో పోస్ట్ చేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక హీరోయిన్ రాధికా పండిట్ను 2016లో వివాహం చేసుకున్నాడు యష్. వీరికి మొదట కూతురు పుట్టింది. కూతురు పేరు ఐరా. కొడుకు గత ఏడాది అక్టోబర్ 30, 2019 పుట్టాడు.
కాగా ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యష్ హీరోగా వచ్చిన కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ, హింది భాషల్లో ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా సీక్వెల్ కూడా వస్తున్న సంగతి విదితమే. కరోనా వల్ల ఇన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ పడగా రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేశారు. తక్కువ మంది టీం ప్రస్తుతం షూటింగ్ ను జరుపుతున్నారు. ఇక శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: