పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ – మైత్రీ నుండి అప్ డేట్

Pawan Kalyan Harish Shankar Movie Update

పవన్ పుట్టిన రోజు హడావుడి అప్పుడే మొదలైపోయింది. ఇక అభిమానులు ఆశగా ఎదురు చూసేది పవన్ సినిమా అప్ డేట్స్ కోసం. రీ ఎంట్రీ లో పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్లాన్ చేసుకున్నాడు. కానీ కరోనా వల్ల సీన్ మొత్తం రివర్స్ అయింది. పరిస్థితులు మాములుగా ఉండి ఉంటే ఈపాటికి వకీల్ సాబ్ విడుదలైపోయేది. క్రిష్ తో సినిమా సగం షూటింగ్ పూర్తయ్యేది. కానీ ఇంకా వకీల్ సాబ్ సినిమా షూటింగే పూర్తి కాలేదు. ఇంకా కొన్నిరోజుల షూటింగ్ మిగిలివుంది. అది పూర్తయ్యాక క్రిష్ సినిమా. ఇక ఈ సినిమాలతో పాటు హరీష్ శంకర్ తో కూడా పవన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు కావడంతో మూడు సినిమాల నుండి అప్ డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే థమన్ వెడ్-నెస్-డే అంటూ తన ట్విట్టర్ ద్వారా వకీల్ సాబ్ సినిమా గురించి హింట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు తాజాగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించారు. పవన్ పుట్టిన రోజున అప్ డేట్ ఉండబోతుందని.. సెప్టెంబర్ 2 వ తేదీన 4 గంటల 5 నిమిషాలకు ముహుర్తాన్ని ఫిక్స్ చేశారు. మరి సినిమా టైటిల్ ను ప్రకటిస్తారేమో అని అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి.

 

మరి ఇక మిగిలింది క్రిష్ మూవీ అప్ డేటే. ఇప్పటి వరకైతే ఎలాంటి న్యూస్ వినిపించలేదు. మరి పవన్ ఫ్యాన్స్ కోసం అప్ డేట్ వదులుతాడో లేదో చూడాలి.

పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.