సింహాద్రి : విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా “సింహాద్రి “మూవీ ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేశారు. 52 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఘనవిజయంతో దర్శకుడు రాజమౌళి , హీరో ఎన్టీఆర్ స్టార్ హోదా అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యమదొంగ: సూపర్ హిట్ “స్టూడెంట్ నెం 1”, “సింహాద్రి “మూవీస్ తరువాత రాజమౌళి , ఎన్టీఆర్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన సోషియో ఫాంటసీ “యమదొంగ ” మూవీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. లెజెండరీ యాక్టర్ Sr ఎన్టీఆర్ గ్రాఫిక్స్ ద్వారా కనిపించడం , ఎన్టీఆర్
ఒక సాంగ్ కు గళాన్ని అందించడం విశేషం.
టెంపర్ :పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టెంపర్ ” మూవీ ఘనవిజయం సాధించింది. కరెప్టెడ్ , క్రిమినల్ మైండ్ పోలీస్ ఆఫీసర్ గా తరువాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మారడం నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.. “టెంపర్ ” మూవీ తమిళ భాషలో “అయోగ్య “గా రీమేక్ అయ్యి తిరిగి తెలుగు లో డబ్బింగ్ కావడం విశేషం.
జనతా గ్యారేజ్: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన మెసేజ్ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా “జనతా గ్యారేజ్ “మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2 నేషనల్ , 7 నంది , 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. యాక్టింగ్ , డైలాగ్ డెలివరీ లో ఎన్టీఆర్ తన సత్తా ను చూపించారు. తన పాత్ర ను సెటిల్డ్ గా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
జై లవకుశ: ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె యెస్ రవీంద్ర దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “జై లవకుశ “మూవీ ఘనవిజయం సాధించి ప్రేక్షకులను అలరించింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. మూడు పాత్రలలో వేరియేషన్స్ చూపిస్తూ నటించి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నెగటివ్ పాత్ర జై లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఎన్టీఆర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: