పోల్ గేమ్ : టాలీవుడ్ బెస్ట్ కమెడియన్ ?

Poll Game: Who Is Your Favorite Among These Tollywood Star Comedians?

బ్రహ్మానందం : పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు బ్రహ్మానందం. 1000 పైగా సినిమాలలో నటించిన బ్రహ్మానందం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందారు. పద్మశ్రీ పురస్కారంతో పాటు బెస్ట్ కమెడియన్ గా 6 నంది , ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ బ్రహ్మానందం అందుకున్నారు. బ్రహ్మానందం ప్రస్తుతం “రంగమార్తాండ ” మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సునీల్ : బ్లాక్ బస్టర్ “నువ్వే కావలి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సునీల్ పలు సూపర్ హిట్ మూవీస్ లో తన కామెడీ తో అలరించారు. సూపర్ హిట్ “అందాలరాముడు “మూవీ తో హీరోగా మారి “మర్యాద రామన్న “, “పూల రంగడు ” వంటి మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బెస్ట్ కమెడియన్ గా సునీల్ ఒక ఫిల్మ్ ఫేర్ , 3 నంది అవార్డ్స్ అందుకున్నారు. తిరిగి కమెడియన్ గా సునీల్”అరవింద సమేత వీర రాఘవ “, “చిత్ర లహరి “, “అల .. వైకుంఠపురములో .. ” మూవీస్ తో తన కామెడీ తో ప్రేక్షకులను అలరించారు.

అలీ: “సీతాకోక చిలుక “(1981 ) మూవీ తో సూపర్ హిట్ “అహ నా పెళ్ళంట” మూవీ తో టాలీవుడ్ కు కమెడియన్ గా  బాలనటుడిగా పరిచయం అయిన అలీ, ఆ మూవీ కి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డ్ అందుకున్నారు. కమెడియన్ గా పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అలీ , తెలుగు , తమిళ , హిందీ భాషలలో 1000 చిత్రాలకు పైగా నటించి 4 దశాబ్దాలుగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. సూపర్ హిట్ “యమలీల ” మూవీ తోహీరో గా పరిచయం అయిన అలీ పలు మూవీస్ లో హీరోగా నటించారు. బెస్ట్ కమెడియన్ గా అలీ 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు.

వెన్నెల కిషోర్ : “వెన్నెల ” మూవీ తో టాలీవుడ్ కు కమెడియన్ గా పరిచయం అయిన కిషోర్ కు ఆ మూవీ పేరుతో వెన్నెల కిషోర్ గా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన కామెడీ తో ప్రేక్షకులను అలరించారు. సుమారు 125 మూవీస్ లో కమెడియన్ గా నటించిన వెన్నెల కిషోర్ “ఇంకోసారి “మూవీ కి బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. 6 మూవీస్ లో కమెడియన్ గా నటిస్తున్న వెన్నెల కిషోర్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ కమెడియన్ గా కొనసాగుతున్నారు.

[totalpoll id=”47764”]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.