గతకొద్దిరోజులుగా కరోనా సినీ పరిశ్రమను బాగా దెబ్బతీసింది అని వింటూనే ఉన్నాం. ఒకపక్క షూటింగులు, రిలీజ్ లు లేక బిజినెస్ సరిగా జరగగా కోట్లలో నష్టం వస్తుంటే.. మరోపక్క ఎంతో మంది నటీనటులు ప్రాణాలు కోల్పోతున్నారు. కారణాలు ఏదైనా కానీ ఈ ఏడాదిలో అది కూడా కరోనా స్టార్ట్ అయిన తర్వాత సినీ పరిశ్రమల్లో చూసిన చావులు ఎప్పడూ చూడలేదంటే అతిశయోక్తి కాదు. లెజెండ్రీ నటీనటుల దగ్గర నుండి యువ నటీనటులు ఎంతో మంది తనువు చాలించారు. ఇప్పుడు మరో సంఘటన చోటుచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పరుచూరి వెంకటేశ్వరరావు సతీమణి విజయలక్ష్మి(74) కన్నుమూశారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో పరుచూరి ఇంట విషాదం నెలకొంది. విజయలక్ష్మీ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ, వెంకటేశ్వరరావుకి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
తెలుగు పరిశ్రమలో పరుచూరి బ్రదర్స్ అంటే అదొక బ్రాండ్. రచయితలుగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు పరుచూరి బ్రదర్స్. వీరిలో పరుచూరి వెంకటేశ్వరరావు పెద్దవారు కాగా, పరుచూరి గోపాలకృష్ణ చిన్నవారు. రచయితలు గానే కాదు పలు సినిమాల్లో నటించారు కూడా పరుచూరి బ్రదర్స్ . ఇద్దరూ ఎన్నో తెలుగు సినిమాలకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు,చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సహా పలువురు అగ్ర కథానాయకులందరి సినిమాలకు పరుచూరి బ్రదర్స్ పనిచేశారు. రీసెంట్ గా చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రానికి పని చేశారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























