బోనీ కపూర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు హెచ్ వినోత్ దర్శకత్వంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా కొనసాగుతున్న తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “వాలిమై ” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హూమా ఖురేషి కథానాయిక కాగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించుకున్న ఈ మూవీ లో ప్రతినాయకుడిగా హీరో కార్తికేయ నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. కరోనా కారణం గా “వాలిమై ” మూవీ షూటింగ్ వాయిదా పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్



సెన్సేషనల్ హిట్ “RX 100” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని కార్తికేయ క్రేజ్ పెంపొందించుకున్నారు. కార్తికేయ హీరోగా రూపొందిన కొన్ని మూవీస్ ప్రేక్షకాదరణ పొందకపోయినా కార్తికేయ క్రేజ్ ప్రేక్షక, అభిమాను లలో ఏ మాత్రం చెక్కు చెదర లేదు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలలో నటించడానికి సిద్ధపడిన కార్తికేయ , నాని హీరోగా రూపొందిన “గ్యాంగ్ లీడర్ ” మూవీ లో ప్రతినాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. ఇక కార్తికేయ కోలీవుడ్ ఎంట్రీ గురించి , “RX 100” మూవీ 2సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి , హీరో కార్తికేయ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో అజయ్ భూపతి , కార్తికేయ కోలీవుడ్ ఎంట్రీ పై హింట్ ఇచ్చారు. దానికి కార్తికేయ అవును , కాదు అని చెప్పకుండా , “వాలిమై ” చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన వచ్చిన తరువాత చూద్దాం అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























