“నందా లవ్స్ నందిత ” కన్నడ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన నందిత శ్వేత సక్సెస్ ఫుల్ “అట్టకత్తి ” మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించారు. సూపర్ హిట్ “ఎక్కడికి పోతావు చిన్నవాడా” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న నందిత బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. పలు తెలుగు , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నందిత ప్రస్తుతం రెండు తెలుగు , ఒక తమిళ మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన నందిత లండన్ స్కూల్ ఆఫ్ ట్రెండ్స్ లో 3నెలల మేకప్ , హెయిర్ స్టైల్ , ఫ్యాషన్ థెరపీ క్లాసెస్ లో జాయిన్ అయ్యారు. నందిత మాట్లాడుతూ .. చాలా రోజులుగా ఫొటోగ్రఫీ నేర్చుకోవాలని అనుకుంటున్నానని , లాక్ డౌన్ సమయం లో కుదిరిందని , కెమెరా దూరంగా పెట్టి తన బెస్ట్ యాంగిల్స్ తో ఫొటోస్ తీయడం లో పర్ ఫెక్ట్ అయ్యానని , తన ఇంటికి దగ్గరగా ఉన్న ప్రదేశాలకు వెళ్ళి ఫొటోస్ తీసేదానినని , ఫొటో ఎడిటింగ్ కూడా నేర్చుకున్నానని, ప్రతి రోజూ నాలుగు లేదా ఐదు గంటలు ఆన్ లైన్ క్లాసెస్ లో పాల్గొంటున్నానని , ఇలా పలు వ్యాపకాలతో బిజీగా ఉంటున్నానని తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























