షార్ట్ ఫిలిమ్స్ తో పాపులర్ అయి టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన తెలుగమ్మాయి ప్రియాంకా జువాల్కర్. మొదటి సినిమాతోనే నటిగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకోవడంతో పాటు.. ఆ సినిమా కూడా హిట్ అవ్వడంతో ఆ సినిమా తర్వాత అవకాశాలు పెరిగిపోతాయని అందరూ భావించారు. కానీ ఈ భామకు అలాంటి అవకాశాలు పెద్దగా వచ్చింది లేదు. అయితే ‘టాక్సీవాలా’ తర్వాత చాలా గ్యాప్ వచ్చిన ప్రియాంకకు ఎట్టకేలకు మరో ఆఫర్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ భామ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటుంది. తన ఫొటోస్ ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా తన అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొన్న ప్రియాంక పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ సందర్భంగా ఒక అభిమాని మీకు వచ్చిన బెస్ట్ సలహా ఏంటి?ఎవరు ఇచ్చారు? అని అడుగగా దానికి ప్రియాంక నాకు వచ్చిన బెస్ట్ అడ్వైజ్ మెగాస్టార్ చిరంజీవి గారి నుండి.. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా తలకి ఎక్కించుకోవద్దని చెప్పారని చెప్పింది.





కాగా శ్రీధర్ గాదే దర్శకత్వంలో “రాజా వారు రాణి గారు” ఫేమ్ కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రియాంక జువాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ RX 100 మూవీ కి సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























