స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ?

All Set for Thalapathy Vijay Entry?

“నాళైయ తీర్పు “మూవీ తో కోలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విజయ్ తనదైన స్టైల్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విజయ్ “కత్తి “, “తెరి”, “మెర్సల్ “, “సర్కార్ “, “బిగిల్ “వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. విజయ్ మక్కల్ అయక్కమ్ (విజయ్ పీపుల్ ఆర్గనైజేషన్ )పేరు తో పలు సేవా కార్యక్రమాలు విజయ్ నిర్వహిస్తున్నారు. అభిమానులు “దళపతి “అని ముద్దుగా పిలుచుకునే విజయ్ నటించిన “మాస్టర్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ద్వారా విజయ్ తెలుగుప్రేక్షకులకు పరిచయమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినీ రంగానికి రాజకీయ రంగానికి అవినాభావ సంబంధం ఉంది. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు రాజకీయాలలో రాణించిన విషయం తెలిసిందే. ఎమ్ జి ఆర్ , ఎన్టీఆర్ , జయలలిత, కరుణానిధి వంటి సినీ ప్రముఖులు ముఖ్య మంత్రులు గా పనిచేసిన విషయం తెలిసిందే. హీరో కమల్ హాసన్ ఇప్పటికే ఒక రాజకీయ పార్టీ స్థాపించగా, తన చిత్రాలలో ప్రభుత్వ విధానాలను తప్పు పడుతూ ఉండడం తో హీరో విజయ్ రాజకీయ రంగ ప్రవేశం పై పలు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ నెల 22 వ తేదీ పుట్టిన రోజు జరుపుకోనున్న విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై అనౌన్స్ చేయనున్నారని సమాచారం. మధురై జిల్లాలో విజయ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు పోస్టర్స్ రిలీజ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.