చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

Mega Star Chiranjeevi Posts An Emotional Tweet On The Occasion Of World Blood Donar Day

ప్రాణం కన్నా విలువైనది ప్రపంచంలో మరొకటి లేదు. అటువంటి ప్రాణాన్ని రక్త దానం చేసి రక్షించడం గొప్ప సంతృప్తి ని కలిగించే విషయమని తెలిసిందే . జూన్ 14 ప్రపంచరక్త దాన దినోత్సవ సందర్భంగా చిరంజీవి ఎమోషనల్ గా ట్వీట్ చేస్తూ ,ఒక వీడియో ను షేర్ చేసి ప్రజలకు సందేశం ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రక్త దానం చేసి మరొకరి జీవితాన్ని కాపాడడం కన్నా సంతృప్తి నిచ్చే విషయం వేరే ఉండదని ,రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి చాలా మంది రక్తదానం చేస్తున్న విషయం తెలిసి ఆనందపడుతున్నానని , ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలని , రక్తదానం చేయండి , ప్రాణదాతలు కండి అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా పలు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. పలు సందర్భాలలో తాను రక్తదానం చేసిన ఫొటోలతో వీడియో రూపొందించి చిరంజీవి సోషల్ మీడియా లో షేర్ చేశారు. సామజిక కార్యక్రమాలతో పాటు సినిమాలలో నటిస్తున్న చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య ” మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.