బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకునే లోపు కరోనా వల్ల మరో పెద్ద బ్రేక్ వచ్చింది. అయితే రాజమౌళి మాత్రం ఎలాంటి బ్రేక్ లేకుండా ఈ గ్యాప్ లో కుదిరినంత వరకూ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా.. జూన్ నుండి షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుండటంతో రాజమౌళి కూడా ఆర్ఆర్ఆర్ సినిమాను తిరిగి ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు జాగ్రత్తలు పాటిస్తూ..ఈ వారంలోనే షూటింగ్ కూడా ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నాడట రాజమౌళి.



ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























