మా వాడిని వదిలెయ్ అన్నా.. వర్మపై మనోజ్ కామెడీ..!

Actor Manchu Manoj Gives Funny Counter To Ram Gopal Varma Tweet
Actor Manchu Manoj Gives Funny Counter To Ram Gopal Varma Tweet

మా వాడిని వదిలెయ్ అన్నా.. వర్మపై మనోజ్ కామెడీ..! నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సినీ సెలబ్రిటీస్ అందరూ తమ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియచేసిన సంగతి తెలిసిందే. అయితే అందరు సెలబ్రిటీస్ చెప్పడం ఒక ఎత్తైతే…వర్మ ట్వీట్ మాత్రం మరో ఎత్తు. అందరికంటే భిన్నంగా స్పందిస్తాడు కాబట్టే వర్మ కాస్త డిఫరెంట్. ఇక నిన్న కూడా ఎన్టీఆర్ పిక్ పై అలానే స్పందించాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫొటో ఒకటి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పిక్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రామ్ గోపాల్ వర్మ కూడా ఈ పిక్ ను ట్వీట్ చేస్తూ.. ఈ ఫొటోలో నిన్ను చూసిన తర్వాత నేను `గే` అయితే బాగుండేది అనిపిస్తోంది. ఆ బాడీ ఎంట్రా నాయనా` అంటూ చమత్కరించాడు. అంతేకాదు.. అంతటితో ఆగకుండా `మియా మాల్కోవా తర్వాత నేను చూసిన సెక్సీ బాడీ ఇదే` అంటూ ఎన్టీయార్ బాడీని ఆమెతో పోల్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ ట్వీట్ చూసిన మంచు హీరో మనోజ్ వర్మకు కామెడీ గా కౌంటర్ ఇచ్చాడు. `మా వాడిని వదిలెయ్ అన్నో..` అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి మనోజ్ ట్వీట్ కు వర్మ ఏదైనా రిప్లై ఇస్తాడా లేదా అన్నది చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.