యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘అడవి రాముడు’కి 16 ఏళ్ళు

Young Rebel Star Prabhas Adivi Ramudu Completes 16 Years

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా పలు మాస్ ఎంటర్‌టైనర్స్ తెరకెక్కాయి. వాటిలో ‘అడవి రాముడు’ ఒకటి. ఆర్తీ అగర్వాల్ నాయికగా నటించిన ఈ చిత్రాన్ని అగ్రశ్రేణి దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించారు. నాజర్, బ్రహ్మానందం, సాయికుమార్, రాళ్ళపల్లి, రాజీవ్ కనకాల, రంగనాథ్, వేణుమాధవ్, రవిబాబు, శివారెడ్డి, జి.వి.సుధాకర్ నాయుడు, అజయ్ రత్నం, ‘తెలంగాణా’ శకుంతల, బండ్ల గణేష్, సీమ‌ ముఖ్య పాత్రలు పోషించగా.. రమ్యకృష్ణ ప్రత్యేక గీతంలో మెరిసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర, గజల్ శ్రీనివాస్ గీతరచనకు “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ అలరించే బాణీలు అందించారు. “ఆరేసుకోబోయి” (మ‌హాన‌టుడు య‌న్టీఆర్ ‘అడవి రాముడు’ సినిమాలోని పాపుల‌ర్ సాంగ్‌కి రీమిక్స్) , “జింక వేట”, “ఆకాశం సాక్షిగా”, “అడుగేస్తేనే”, “గోవిందా గోవింద”, “నగరంలో ఈపూట ”.. ఇలా ఇందులోని పాటలన్నీ అప్పట్లో ప్రేక్షకులను అలరించాయి. ఫ్రెండ్లీ మూవీస్ ప‌తాకంపై చంటి అడ్డాల ఈ చిత్రాన్ని నిర్మించారు. 2004 మే 21న విడుదలైన ‘అడవి రాముడు’.. నేటితో 16 ఏళ్ళను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.