[POLL]: పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ ఫిల్మ్ ‘వకీల్ సాబ్’ రిజల్ట్‌పై మీ ఎక్స్‌పెక్టేష‌న్ ఏంటి?

What Is Your Expectation On Power Star Pawan Kalyan Come Back Movie Vakeel Saab?

అతనో ట్రెండ్ సెట్టర్.. ట్రెండ్‌ని సెట్ చేయడమే కాని ట్రెండ్‌ను ఫాలో అవడం తెలీదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అతనో ఆకాశం.. పాసింగ్ క్లౌడ్స్ తనని కవర్ చేస్తున్నా.. చెక్కు చెదరని ఇమేజ్ తన సొంతం.

అతనో సంచ‌ల‌నం.. కొన్నిసార్లు అత‌ను రావడం లేట్ కావొచ్చేమో కాని.. రావడం, కొంగ్రొత్త రికార్డులు క్రియేట్ చేయ‌డం మాత్రం పక్కా.

ఈ ఉపోద్ఘాతం అంతా చదువుతుంటే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఆ ‘అతను’ ఎవరో. య‌స్.. ఆ ‘ఆరడుగుల బుల్లెట్’ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

బాక్సాఫీస్‌కి కొత్త లెక్కలు నేర్పిన కథానాయకుల్లో పవన్ కళ్యాణ్‌ది ఓ ప్రత్యేక అధ్యాయం. సినిమా ఎలా ఉన్నా స‌రే.. ఓపెనింగ్ డే రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదయ్యాయంటే అది ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా’ అనేదే అభిమానుల అభిప్రాయం. అలాంటి పవన్ క్రియాశీలక రాజకీయాలతో గత రెండేళ్లుగా సినిమాలకు దూరమయ్యారు.

కట్ చేస్తే.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ. వాటిలో ప‌వ‌న్ నుంచి ముందుగా రాబోతున్న చిత్రమే ‘వకీల్ సాబ్’. ఇందులో పవర్‌ఫుల్ లాయర్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హిందీ కోర్ట్ డ్రామా ‘పింక్’కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ ‘వకీల్ సాబ్’ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పుచేర్పులతో తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు శ్రీరామ్ వేణు.

ఆ మధ్య విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్‌కి అనూహ్య స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘వకీల్ సాబ్’గా పవన్ సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమనే చర్చలు సాగాయి. పోస్టర్‌కే ఇలాంటి రెస్పాన్స్ ఉంటే మరి సినిమా పరిస్థితి ఏంటి? ఈ విషయంపైనే ‘ది తెలుగు ఫిలిమ్ నగర్.కామ్’ ఓ ఆసక్తికరమైన పోల్ గేమ్‌ను నిర్వహిస్తోంది. ఈ ఏడాది చివర‌లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కానున్న ‘వకీల్ సాబ్’ రిజల్ట్‌పై మీ ఎక్స్‌పెక్టేష‌న్ ఏమిటన్నదే ఈ పోల్ గేమ్ థీమ్. మీ అభిప్రాయాన్ని మీ ఓటు ద్వారా తెలియజేసే అవకాశమిది. మరెందుకు ఆలస్యం.. పోల్ గేమ్‌లోకి ఎంటర్ అవుదాం.

[totalpoll id=”43457″]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.