చిరుతో నటించాలని ఉంది..!

టైటిల్ చూసి అదేంటి రమ్య కృష్ణ చిరుతో చాలా సినిమాలు చేసింది కదా అన్న డౌట్ వచ్చే ఉంటది కదా. మెగాస్టార్ చిరంజీవి-రమ్య కృష్ణ కాంబినేషన్ ఒకప్పుడు సూపర్ హిట్ కాంబినేషన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సినిమాలో కాదులెండి రమ్యకృష్ణ అనేది. ఆమె చేయాలనుకుంటుంది తనతో పాటు సినిమాలో కాదు.. వెబ్ సిరీస్‌లో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ కు ఎంత డిమాండ్ ఉందో తెలుసు. చాలామంది సినీ తారలు కూడా వెబ్ సిరీస్ లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రమ్యకృష్ణ జయలలిత జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న ‘క్వీన్’ అనే వెబ్ సిరీస్‌లో నటించిన విషయం తెలిసిందే. తమిళ్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక దీనితో వెబ్ సిరీస్‌లలో నటించాలని అనుకుంటుందట. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె వెబ్ వెరీస్ ల గురించి మాట్లాడుతూ… వెబ్ సిరీస్‌లలో నటించాలని ఉంది… తెలుగులో మాత్రం మెగాస్టార్ చిరంజీవితో కలిసి వెబ్ సిరీస్ చేయాలని ఉందని ఆమె తెలిపారు.

ఇక చిరు కూడా వెబ్ సిరీస్ లలో నటించే అవకాశం ఉందని ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి. మరి చూద్దాం రమ్యకృష్ణ కోరిక ఈ రకంగా అయినా తీరుతుందేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.