ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు. ఒక పక్క అభిమానులు తమ హీరో బర్త్ డే సందర్భంగా ఏ సినిమా ఏ అప్ డేట్ వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ నుండి పెద్ద సర్ప్రైజ్ ఏ ఉంటుందని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమానుండి ఏదో ఒక అప్డేట్ వస్తుందని.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నట్టు కూడా వార్తలు వస్తుండటంతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు గురించిన కూడా ప్రకటన రావొచ్చని అనుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ పుట్టినరోజున తాను కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ ను సిద్ధం చేసినట్టుగా నారా రోహిత్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఆ స్పెషల్ గిఫ్ట్ ఏమిటో తెలుసుకోవాలంటే ఈ నెల 20వ తేదీ వరకూ వేచి వుండవలసిందేనని అంటున్నాడు. మరి ఏం గిఫ్ట్ ఇస్తున్నాడో చూడాలంటే ఆ రోజు వరకూ వెయిట్ చేయాల్సిందే.
Kudos Tarak fans on dropping out a phenomenal CDP. Stay tuned as I am planning a special gift for @tarak9999 & you guys on 20th. Keep guessing……🙂 #NTRBirthdayCDP pic.twitter.com/pIXu61kWWK
— Rohith Nara (@IamRohithNara) May 9, 2020
కాగా నారా రోహిత్ రీసెంట్ గానే ట్విట్టర్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ‘వీర భోగ వసంత రాయలు’ సినిమా తర్వాత మరే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లలేదు. అయితే ఇప్పుడు మరో కొత్త సినిమాలో నటించడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అంతే కాదు తన తదుపరి సినిమా కోసం సన్నగా, ఫిట్‌గా తయారైన ఫొటోస్ బయటకు కూడా వచ్చేసాయి. లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం ఆ సినిమాను అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: