నటీనటులు తమ ప్రేమ గురించి మీడియా కంట పడకుండా.. వార్తల్లో రాకుండా ఉండటానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ పబ్లిక్ పర్సనాలిటీస్ కాబట్టి ఎంత దాచిన ఏదో ఒకరకంగా వార్తలు వస్తూనే ఉంటాయి. ఒకవేళ వార్తలు వచ్చినా ఎక్కడా నోరు మాత్రం విప్పకుండా తమ పని తాము చేసుకుంటారు. కొంతమంది మాత్రం ఓపెన్ గానే రిలేషన్ లో ఉన్నామని చెప్తారనుకోండి. కాకపోతే ఎక్కువ మంది సెలబ్రిటీస్ మాత్రం సీక్రెట్ నే మెయిన్ టైన్ చేస్తుంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఇన్ని రోజులు సీక్రెట్ మెయిన్ టైన్ చేసిన తాప్సీ ఇప్పుడు తన ప్రేమ వ్యవహారాన్ని మాత్రం బయట పెట్టేసింది. ఇన్ని రోజులు తను ప్రేమలో ఉన్నట్లు చెప్పినప్పటికీ అతనేవరో మాత్రం చెప్పలేదు. అయితే ఇప్పుడు ఆ సస్పెన్స్ ను కూడా రివీల్ చేసింది. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన తాప్సీ.. తన బాయ్‌ఫ్రెండ్ బ్యాట్మంటన్ ఆటగాడైన మాథియాస్ బో అని చెప్పేసింది. ‘ఒకవేళ బోతో నా ప్రేమను మా తల్లిదండ్రులు అంగీకరించకపోయుంటే తనతో నా ప్రేమకు స్వస్తి పలకాల్సి వచ్చేది. ఎప్పుడూ నేను ప్రేమలో ఉన్నాన్న విషయమే చెప్పాను కానీ బాయ్ ఫ్రెండ్ ఎవరన్నది స్పష్టం చేయలేదని ఒప్పుకుంటాను. ఎందుకంటే నటిగా నాకంటూ ఓ గుర్తింపు వచ్చేవరకు తను ఎవరన్నది చెప్పలేకపోయాను. ఎందుకంటే ఓ నటిగా నా విశ్వసనీయతకు ఇది దూరం. ఒకవేళ చెప్పుంటే గతేడాది నేను సాధించిన విజయాలు నాకు అంది ఉండేవి కావేమో’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక నేను ఎవరి నుంచి నా ప్రేమను దాచడానికి ఇష్టపడను. మొత్తానికి రూమర్లకు తావు లేకుండా నిజం చెప్పేసింది తాప్సీ.




ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెరకి పరిచయమైంది తాప్సీ. తెలుగులో ఈ అమ్మడికి అంత సక్సెస్‌లు లేకపోయిన హిందీలో మాత్రం భారీ విజయాలని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది తాప్సీ. పింక్, బద్లా, తప్పడ్ ఇలా వరుస విజయాలు సొంతం చేసుకొని అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























