పలు సూపర్ హిట్ మూవీస్ లో కమెడియన్ గా తన స్టైల్ లో నటించి ప్రేక్షకులను అలరించిన సునీల్ స్టార్ కమెడియన్ గా రాణించి హీరోగా మారారు. సునీల్ హీరోగా నటించిన కొన్ని మూవీస్ పరాజయం పాలవడంతో తిరిగి కమెడియన్ గా నటిస్తున్నారు. సినిమాలలో రావడానికి ముందే దర్శకుడు త్రివిక్రమ్, సునీల్ మంచి స్నేహితులు. సునీల్ స్టార్ కమెడియన్ స్టేటస్ అందుకొనడానికి త్రివిక్రమ్ సపోర్ట్ ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “అరవింద సమేత వీర రాఘవ”, “అల వైకుంఠపురంలో .”. మూవీస్ లో సునీల్ కు అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ మరోమూవీ లో కీలక పాత్రకు ఎంపిక చేశారని సమాచారం. హారిక &హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా #NTR 30 మూవీ రూపొందనుంది. ఎన్టీఆర్ నటిస్తున్న “రౌద్రం రణం రుధిరం” మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. #NTR 30 మూవీలో సునీల్ పాత్రను దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకం గా డిజైన్ చేశారని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































