హీరోని కాకపోయి ఉంటే ఖచ్చితంగా అదే అయ్యేవాడిని..!

Vijay Deverakonda Says He Would Have Become An Architect If He Wouldn't Have Been An Actor
Vijay Deverakonda Says He Would Have Become An Architect If He Wouldn't Have Been An Actor

డాక్టర్ ను అవ్వబోయి యాక్టర్ ను అయ్యాను ఈ డైలాగ్ ఇప్పటికి చాలా సార్లే వినుంటాం. మన టాలీవుడ్ లో చాలా మంది హీరో, హీరోయిన్ లు, డైరెక్టర్ లు, నిర్మాతలు ఇలా చాలా పెద్ద చదువులు చదివిన వాళ్లే వున్నారు. వాళ్ళల్లో  కొంత మంది సినిమా మీద ప్రేమతో పెద్ద ఉద్యోగాలు సైతం వదులుకొని రాగా.. కొంతమంది మాత్రం అనుకోకుండా వచ్చిన వాళ్ళు కూడా వున్నారు. ఇక విజయ్ దేవరకొండ కూడా సినిమా మీద ప్రేమతో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. చిన్న పాత్రలు కూడా ఎలాంటి మొహమాటం లేకుండా చేసి తక్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అలాంటి విజయ్ ఒకవేళ హీరో కాకపోయి ఉంటే ఏమయ్యేవాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదే విషయాన్ని విజయ్ ను అడుగగా ఆర్కిటెక్ట్ ను అయ్యేవాడినని చెపుతున్నాడు. తనకు ఆర్కిటెక్చర్ రంగం అంటే చాలా ఇష్టం అని, తాను ఎప్పుడు విదేశీ ప్రయాణాలు చేసినా అక్కడి కట్టడాలు.. వాటి నిర్మాణాలు చూస్తే చాలా బాగా అనిపిస్తుందని.. ఆర్కిటెక్చర్ కు సంబంధించి ఎన్నో వీడియోలు చూస్తుంటానని వివరించారు. ఆర్కిటెక్చర్ కోసం ఏ దేశం అయినా వెళ్లాలని భావిస్తే అది జపాన్ మాత్రమేనని తెలిపారు. ఒకవేళ తాను సినీ నటుడ్ని కాకపోయుంటే ఆర్కిటెక్ట్ అయ్యేవాడ్నని స్పష్టం చేశారు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ తో ఫైటర్ సినిమా చేస్తున్నాడు క‌రోనా వైరస్ కార‌ణంగా చిత్రీక‌ర‌ణ వాయిదా వేశారు. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించనున్నారు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.