తెరజీవితంలోనే కాదు నిజజీవితంలోనూ స్నేహానికి అధిక ప్రాధాన్యమిచ్చే మెగాస్టార్ చిరంజీవి.. 1999లో వరుసగా రెండు ఫ్రెండ్షిప్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌లో నటించారు. అందులో ఒకటి `స్నేహం కోసం` కాగా, మరొకటి `ఇద్దరు మిత్రులు`. టైటిల్స్‌లోనే స్నేహాన్ని ప్రతిబింబిస్తూ తెరకెక్కిన ఈ రెండు సినిమాల్లోనూ స్నేహితుడి పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు చిరు. `స్నేహం కోసం` ఇద్దరు మగ స్నేహితుల చుట్టూ తిరిగే కథతో ఆద్యంతం హృద్యంగా తెరకెక్కితే.. `ఇద్దరు మిత్రులు` ఆడ, మగ మధ్య ఉండే స్వచ్ఛమైన స్నేహానికి ప్రతీకలా రూపొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాటిలో ‘ఇద్దరు మిత్రులు’ విషయానికొస్తే.. “మాతృత్వానికి మగరూపానివై.. నాన్నతనంలో కణ్వుడివై… అన్నగుణంలో కృష్ణుడివై.. బతుకంతా జతగా నిలిచే విధిలో పతినే మించిన తోడువై.. బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా..” అంటూ సాగే “బంగారం తెచ్చి” పాట.. ఈ సినిమాలోని ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహబంధాన్ని ఆవిష్కరిస్తుంది.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరు, సాక్షి శివానంద్ ప్రాణ స్నేహితులుగా నటించగా.. రమ్యకృష్ణ, సురేష్, సుధాకర్, చంద్రమోహన్, మల్లికార్జునరావు, ఏవీయస్, బ్రహ్మానందం, వై.విజయ ముఖ్య భూమికలు పోషించారు. రంభ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఈ చిత్రానికి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందించగా ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, చంద్రబోస్ సాహిత్యాన్ని సమకూర్చారు. “బంగారం తెచ్చి”, “నూటొక్క జిల్లాల్లో”, “మనసావాచా మనసిస్తే”, “దేఖ్ బేబీ దేఖ్”, “హే రుక్కు రుక్కు”, “చాంగు చాంగు”.. ఇలా ఇందులోని ప్రతీ పాట ప్రేక్షకాదరణ పొందింది. 1999 ఏప్రిల్ 30న విడుదలైన `ఇద్దరు మిత్రులు`… నేటితో 21 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: