“లక్ష్మీ కళ్యాణం ” మూవీ తో సినీ కెరీర్ ను ప్రారంభించిన కాజల్ అగర్వాల్ తన అందం, అభినయం తో ప్రేక్క్షకులను ఆకట్టుకుని అనేక తెలుగు, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించి టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. “మోసగాళ్ళు” , “ఆచార్య ” మూవీస్ లో నటిస్తున్న కాజల్ రెండు తమిళ, ఒక హిందీ మూవీ లో నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటించిన “ప్యారిస్ ప్యారిస్ ” తమిళ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా కారణంగా షూటింగ్స్ రద్దు కావడంతో సినీ సెలబ్రిటీస్ ఇళ్ళకే పరిమితం అయ్యారు. ఎప్పడూ షూటింగ్స్, ప్రమోషన్స్, విదేశీ టూర్స్ తో బిజీగా ఉండే సినీ తారలు కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్నారు. ఇటీవల కాజల్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులప్రశ్నలకు జవాబులిచ్చారు. ప్రతీ రోజు 45 నిమిషాల పాటు ధ్యానం తరువాత వర్క్ అవుట్స్ చేస్తున్నానని, “చెస్ ” గేమ్ లో ట్రైనింగ్ పొందుతున్నానని, భగవద్గీత, భాగవతం వంటి పురాణాలు చదువుతున్నానని , టీవీ లో రామాయణం , మహాభారతం సీరియల్స్ చూస్తున్నానని, రెగ్యులర్ గా న్యూస్ ఫాలో అవుతున్నానని,ఈ విధంగా రోజు అంతా బిజీగా ఉంటున్నానని కాజల్ తెలిపారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























