నటసింహ నందమూరి బాలకృష్ణకి అచ్చొచ్చిన నిర్మాతల్లో ‘యువ చిత్ర’ అధినేత కె.మురారి ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన రెండు చిత్రాలు ఇటు కమర్షియల్గానూ, అటు మ్యూజికల్‌గానూ మంచి సక్సెస్ సాధించాయి. వాటిలో ఒకటి ‘సీతారామకళ్యాణం’ కాగా, మరొకటి ‘నారీ నారీ నడుమ మురారి’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘నారీ నారీ నడుమ మురారి’ విషయానికొస్తే.. ఇది బాలకృష్ణ నటించిన 50వ చిత్రం కావడం విశేషం. అగ్ర దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ సినిమాలో బాలయ్య సరసన శోభన, నిరోషా నాయికలుగా నటించగా.. కైకాల సత్యనారాయణ, శారద, తనికెళ్ళ భరణి, అల్లు రామలింగయ్య, రమాప్రభ, అంజలీదేవి, అనంత్, చిట్టిబాబు, శ్రీలక్ష్మి, మమత ముఖ్య భూమికలు పోషించారు. ఆచార్య ఆత్రేయ, వేటూరి సుందరరామమూర్తి, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి గీత రచనకు.. దిగ్గజ స్వరకర్త కె.వి.మహదేవన్ స్వరాలు సమకూర్చారు. “ఇరువురు భామల కౌగిలిలో స్వామి”, “పెళ్ళంటూనే వేడెక్కిందే గాలి”, “ఏం వానో తడుముతున్నది”, “మనసులోని మర్మమును తెలుసుకో”, “వయసూ సొగసూ కలిసిన వేళా”, “దుత్తలాగున్నావే రత్తమ్మత్తా”.. ఇలా ప్రతీ పాట అజరామరంగా నిలిచిపోయింది. 1990 ఏప్రిల్ 27న విడుదలై ఘనవిజయం సాధించిన ‘నారీ నారీ నడుమ మురారి’.. నేటితో 30 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: