తెలుగు సినిమాకు సంబంధించినంత వరకు సంక్రాంతి సీజన్‌ని వసూల్ సీజన్‌గా చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో విడుదలైన పలు చిత్రాలు భారీ స్థాయిలో కాసుల వర్షం కురిపించడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది ముగ్గుల పండక్కి విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. ఈ నేపథ్యంలోనే.. వచ్చే సంక్రాంతికి మరో క్రేజీ ప్రాజెక్ట్ సందడి చేయనుందని తెలుస్తోంది. ఆ చిత్రమే.. ‘వకీల్ సాబ్’.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. హిందీనాట విజయం సాధించిన ఎమోషనల్ కోర్ట్ డ్రామా ‘పింక్’ (బిగ్ బి అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రధారులు) తెలుగులో ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీగా తెరకెక్కుతున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌ని ‘దిల్’ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్ సీజన్లో విడుదల చేయాలని యూనిట్ భావించింది. అయితే, కరోనా వైరస్ ప్రభావం, లాక్ డౌన్ పిరియడ్ కొనసాగుతుండడం వంటి కారణాల వల్ల చిత్రనిర్మాణంలో జాప్యం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే.. ఆగస్టులో ‘వకీల్ సాబ్’ని విడుదల చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన యూనిట్‌కి వచ్చింది. అయితే, థియేటర్లపై కరోనా ఎఫెక్ట్ ఏడాది చివరి వరకు ఉండే అవకాశం కనిపిస్తుండడంతో.. వసూల్ సీజన్ అయిన సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ని రిలీజ్ చేయాలని ‘దిల్’ రాజు అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రానుంది.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పవన్ గత చిత్రం ‘అజ్ఞాతవాసి’ సంక్రాంతికే విడుదలైంది. మళ్ళీ మూడేళ్ళ తరువాత పవన్ రీ-ఎంట్రీ ఫిల్మ్ ‘వకీల్ సాబ్’ కూడా అదే సీజన్లో రిలీజ్ కానుండడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: