
సినిమా ఇండస్ట్రీ లో కొన్ని కాంబినేషన్ ఎప్పటికీ అలానే ఉండిపోతాయి. అందులో రాజమౌళి, కీరవాణి కాంబినేషన్ ఒకటి. రాజమౌళి మొదటి సినిమా నుండి ఇప్పుడు తను తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వరకు అన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే కీరవాణి. మరి మరి ఒక సినిమాను ఎంత బాగా తీసినా దానికి తగిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సంగీతం బాలేకపోతే వేస్ట్. అందుకే సినిమాకు తగిన విధంగా, దర్శకుడికి తగిన విధంగా సంగీతం అందించడం అనేది కీరవాణి ప్రత్యేకత. అలానే రాజమౌళి.. కీరవాణి కాంబినేషన్ కూడా అంత బాగా సెట్ అయింది. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తనకు కావాల్సిన అవుట్ ఫుట్ వచ్చేంత వరకూ నో కాంప్రమైజ్ అనే రకం. ఎన్ని తిప్పలు పెట్టైనా సరే ఫైనల్ గా తనకు కావాల్సింది రప్పించుకుంటాడు. మరి అలాంటి రాజమౌళిలో కీరవాణికి నచ్చని ఒక విషయం ఉందట. అదేంటంటే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా రాజమౌళి గురించి కీరవాణి మాట్లాడుతూ “మొదటి నుంచి కూడా రాజమౌళికి పట్టుదల ఎక్కువ. ఒక విషయాన్ని మనసులో అనుకుంటే దానిని సాధించేవరకూ పోరాడుతూనే ఉంటాడు. అలాగే రాజమౌళికి ఏకాగ్రత ఎక్కువ .. ఏ విషయాన్నైనా వెంటనే పట్టేస్తాడు. ఆ పనిని తాను ఎంత పెర్ఫెక్ట్ గా చేయగలననే దానిపైనే దృష్టి పెడతాడు అని ప్రశంసలు కురిపించాడు. ఇక ఆయనలో నాకు నచ్చని విషయాలు ఏంటంటే… రాజమౌళి ఎక్కువగా చిన్నపిల్లల సినిమాలు చూస్తుంటాడు. అవి కాకుండా వేరే సినిమాలు చూడమంటూ వాటి పేర్లను సూచించినా పట్టించుకోడు. ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా ఓ పక్కకి వెళ్లి చిన్నపిల్లల సినిమాలు చూస్తూ కూర్చుంటాడు. ఆయనలో నాకు నచ్చని విషయం ఇదే” అంటూ నవ్వేశారు. ఇంటర్నేషనల్ లెవెల్ సినిమాలు తీసే రాజమౌళి చిన్న పిల్లల సినిమాలు చూడటం ఏంటని నవ్వు రావొచ్చు. కానీ ఏ కారణం లేకుండా రాజమౌళి ఆ పని చేయడే.. మరి చిన్న పిల్లలు సినిమాలు చూసి రాజమౌళి ఏం నేర్చుకుంటున్నాడో…




రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం'(ఆర్ఆర్ఆర్). ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు కూడా కీరవాణినే సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























