మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ తేజ్, కృతిశెట్టి జంటగా నిజ జీవిత సంఘటనలతో “ఉప్పెన” మూవీ రూపొందింది. తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటించిన ఈ మూవీ కి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. భారీ అంచనాలు ఉన్న “ఉప్పెన” మూవీ కరోనా కారణం గా విడుదల వాయిదాపడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




“ఉప్పెన” మూవీ తమిళ రీమేక్ రైట్స్ తమిళ హీరో విజయ్ సేతుపతి స్వంతం చేసుకున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి, మైత్రీ మూవీ మేకర్స్ భాగస్వామ్యంలో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ హీరోగా తెరకెక్కించనున్నారని సమాచారం. “ఉప్పెన” మూవీ తెలుగు వెర్షన్ లో నటించిన పాత్రనే విజయ్ సేతుపతి తమిళ రీమేక్ మూవీ లో కూడా నటించనున్నారని సమాచారం. విజయ్ సేతుపతి ప్రస్తుతం స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన “మాస్టర్” మూవీ లో విలన్ గా నటించారు. తండ్రి (విజయ్ ) తనయుడు (సంజయ్ ) మూవీస్ లో విజయ్ సేతుపతి విలన్ గా నటించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























