మెగా అభిమానులకు ‘చిరు’ ఉగాది కానుక

Mega Star Chiranjeevi Special Ugadi Gift To Audience

టైటిల్ చూసి చిరు ఉగాదికి ఏం కానుక ఇవ్వనున్నారబ్బా అనుకుంటున్నారుకదా..? తన 152 సినిమా గురించి ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో అని.. సినిమా టైటిల్ ఏమన్నా ప్రకటిస్తారేమో.. ఇలా పలు ఆలోచనలు రావొచ్చు. కానీ అసలు సంగతేంటంటే.. చిరు ఇవ్వనున్న సర్ ప్రైజ్ ఏంటంటే… తాను కూడా సోషల్ మీడియాలో ఎంటర్ అవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఇక తన భావాలను, సందేశాలను తన అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియా అకౌంట్స్ ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్నీ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుండి ఆయన తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జోడి జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ .. త్వ‌ర‌లోనే త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభించ‌నుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.