వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న తమిళ కథానాయకుల్లో సూర్య ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే ఈ టాలెంటెడ్ స్టార్.. త్వరలో లాయర్ అవతారమెత్తనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. `కూటత్తిల్ ఒరుత్తన్` అనే తమిళ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ఇందులో సూర్య ఓ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. కథ రీత్యా.. గిరిజనుల ప్రయోజనం కోసం పోరాడే న్యాయవాదిగా దర్శనమివ్వనున్నాడట సూర్య. ఈ పాత్ర సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తుందని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.




కాగా, సూర్య తాజా చిత్రం `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా`) వేసవిలో విడుదల కానుంది. ఆపై హరి దర్శకత్వంలో `అరువా` చిత్రం చేయనున్నాడు సూర్య. మరి.. రాబోయే చిత్రాలతో సూర్య ఏ తీరున అలరిస్తాడో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























