మొత్తానికి అల్లు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్ కూడా చిన్నప్పటినుండే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. ఒకపక్క అల్లు అర్జున్ తన పాటలతో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంటే.. మరో పక్క పిల్లలు అర్హ, అయాన్ తమ క్యూట్ వీడియోస్ తో ట్రెండింగ్ లో నిలుస్తున్నారు. అర్హ, అయాన్ వీడియోస్ ఏమున్నా వెంటనే అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటాడు. అర్హ, బన్నీ వీడియోస్ అయితే అలా బయటికి వచ్చిన వెంటనే కొద్దినిమిషాల్లోనే వైరల్ గా మారుతున్నాయి. ఇక తాజాగా మరో వీడియో ను పోస్ట్ చేసాడు బన్నీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అల్లు అయాన్ బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ ని ముద్దు ముద్దుగా రిక్వస్ట్ చేస్తున్నాడు. ‘హాయ్ టైగర్ స్క్వాష్.. భాగీ 3 సెట్స్ కు నన్ను పిలవండి ప్లీజ్ అని అడిగాడు..ఎందుకూ అని పక్కన అల్లు అర్జున్ అడగగా… టైగర్ బాడీ, గన్ ఫైట్స్ చాలా బావుంటాయి అని అల్లు అయాన్ సమాధానం ఇచ్చాడు. మరి అల్లు వారసుడు అంత ముద్దుగా అడిగితే టైగర్ ష్రాఫ్ మాత్రం ఎందుకు ఊరుకుంటాడు.. వీడియో చూసిన టైగర్…నా కొత్త పేరు చాలా బావుంది. భాగీ 3 సెట్స్ కి మాత్రమే కాదు.. తను నా అన్ని చిత్రాల సెట్స్ కు రావచ్చని చెప్పండి అల్లు అర్జున్ సర్ అని టైగర్ ష్రాఫ్ కామెంట్ పెట్టాడు. మరి అల్లు అయాన్ ను బన్నీ తీసుకెళ్తాడా?లేదా?చూద్దాం..




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























