`ఖైదీ నంబర్ 150`తో గ్రాండ్ గా రీ-ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఆపై పేట్రియాటిక్ డ్రామా`సైరా నరసింహారెడ్డి`లో నటించారు. ఈ రెండింటిలోనూ సీరియస్ రోల్స్ లోనే కనిపించారు చిరు. అంతేకాదు.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సోషల్ డ్రామా `ఆచార్య`లోనూ అదే శైలి పాత్రని పోషిస్తున్నారాయన.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే, తన 153వ చిత్రంలో మాత్రం అందుకు భిన్నంగా పూర్తిస్థాయి వినోదాత్మక పాత్రలో దర్శనమివ్వనున్నారట చిరు. ఆ వివరాల్లోకి వెళితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మెగాస్టార్ ఓ సినిమా చేయబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ ఏడాది చివరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని… `చంటబ్బాయ్` తరహాలో ఇందులోనూ చిరు పూర్తిస్థాయి హాస్యభరిత పాత్రలో నటిస్తారని తెలిసింది. త్వరలోనే చిరు, త్రివిక్రమ్ కాంబో మూవీపై మరింత స్పష్టత వస్తుంది.
కాగా, ఇదివరకు చిరు కథానాయకుడిగా నటించిన `జై చిరంజీవ!`కి త్రివిక్రమ్ రచయితగా పనిచేసిన సంగతి తెలిసిందే. మరి.. మెగా కాంపౌండ్ లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఘన విజయాలే చూసిన త్రివిక్రమ్.. మెగాస్టార్ తోనూ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























