`బెంగాల్ టైగర్` (2015) చిత్రంలో తొలిసారి జంటగా నటించి అలరించారు మాస్ మహారాజా రవితేజ, మిల్కీ బ్యూటీ తమన్నా. కట్ చేస్తే.. ఐదేళ్ళ తరువాత ఈ ఇద్దరు మరోమారు జోడీకట్టబోతున్నారట. ఆ వివరాల్లోకి వెళితే.. `సినిమా చూపిస్త మావ`, `నేను లోకల్` చిత్రాల దర్శకుడు త్రినాథరావ్ నక్కిన డైరెక్షన్ లో రవితేజ ఓ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ చేయనున్నాడు. మే నుండి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజకి జోడీగా తమన్నా నటిస్తుందని ప్రచారం సాగుతోంది. త్వరలోనే తమన్నా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం `క్రాక్`తో పాటు దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇక తమన్నా విషయానికి వస్తే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న `సీటీమార్`లో నటిస్తోంది. అలాగే ఓ హిందీ సినిమాలోనూ నటిస్తోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































