పాన్ ఇండియా మూవీస్ పై ప్రభాస్ కు ఆసక్తి

Young Rebel Star Shows His Interest On Making Pan India Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Prabhas,Prabhas Latest News,Prabhas New Movie News,Prabhas Next Film Updates,Prabhas Latest Film News

బ్లాక్ బస్టర్ “బాహుబలి “, “బాహుబలి2” మూవీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభాస్ కు దక్షిణాది తో పాటు ఉత్తరాదిలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన స్టైలిష్ మూవీ “సాహో” ఇతర భాషలలో ఆశించిన విధంగా విజయం సాధించకపోయినా హిందీ లో ఆ మూవీ కి ప్రేక్షక , అభిమానులు బ్రహ్మరథం పట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రేక్షకులలో తన కున్న క్రేజ్ ను బట్టి తన మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా రుపొందాలని ప్రభాస్ కోరుకుంటున్నారు. ప్రభాస్ కోరుకుంటున్నట్టుగా మరే టాలీవుడ్ హీరోలు ఆ దిశగా ప్రయత్నించడం లేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ ప్లాన్ చేయడం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న #VD 10 మూవీ తో
విజయ్ దేవరకొండ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మూవీ ట్రై చేస్తున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియన్ స్క్రిప్ట్స్ కై డైరెక్టర్స్ ను అడుగుతున్నారని సమాచారం. హీరో ప్రభాస్ ప్రస్తుతం #Prabhas 20 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.